బిదినంచర్లలో గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన పనుల పరిశీలన

సింహాద్రిపురం మండలం బిదినంచర్ల గ్రామంలోని యేనేమీద గంగమ్మ తల్లి దేవస్థానంలో జరుగుతున్న విగ్రహ ప్రతిష్ఠాపన, ఆలయ నిర్మాణ పనులను వైస్ ఎంపీపీ శ్రీకాంత్ రెడ్డి సోమవారం పరిశీలించారు. ఏప్రిల్ 8 నుంచి ప్రారంభం కానున్న కుంభాభిషేక మహోత్సవాల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన అధికారులకు, నిర్వాహకులకు సూచించారు. ఏప్రిల్ 8 నుంచి 10 వరకు మూడు రోజుల పాటు మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
