బుధవారం పులివెందుల పట్టణంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో వేముల మండలం పెండ్లూరుకు చెందిన 10 కుటుంబాలు టీడీపీలో చేరాయి. పార్టీ నాయకుడు రఘునాథరెడ్డి వారికి పార్టీ జెండాలు కప్పి టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. పులివెందుల నియోజకవర్గ సమగ్రాభివృద్ధి కోసం బీటెక్ రవి చేస్తున్న కృషికి ఆకర్షితులై తాము పార్టీలో చేరామని వారు తెలిపారు.