జనసేన బలోపేతంపై నాయకుల చర్చ

4385చూసినవారు
జనసేన బలోపేతంపై నాయకుల చర్చ
వైఎస్సార్‌ కడప జిల్లా, పులివెందులలో జనసేన పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసే లక్ష్యంతో పార్టీ నాయకులు కడప పార్లమెంట్ అబ్జర్వర్ శ్రీ చిలక మధుసూదన్ రెడ్డిని సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి చర్చించారు. ఈ సందర్భంగా, రాయలసీమ ప్రోగ్రాం కమిటీ కో-కన్వీనర్ వెన్నపూస భరత్ రెడ్డి, జనసేన నాయకులు డి.ఎస్.పీ. ప్రసాద్, ఫరూక్ లు పులివెందుల నియోజకవర్గంలోని పార్టీ పరిస్థితులు, సంస్థాగత నిర్మాణం, కమిటీల ఏర్పాటు, ప్రజా సమస్యలు, రాబోయే పార్టీ కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు.

సంబంధిత పోస్ట్