పులివెందులలోని పాత బస్టాండ్, పార్నపల్లి బస్టాండ్ సమీపంలో గురువారం ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఎండాకాలంలో ప్రయాణికులు, ప్రజలకు చల్లని తాగునీరు అందించేందుకు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పెరుగుతున్న ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రజలకు తాగునీరు అందుబాటులో ఉండటం చాలా అవసరమని ఆయన అన్నారు.