కడప జిల్లాలోని మూడు ప్రధాన దేవాలయాలకు ప్రభుత్వం కొత్త కార్యనిర్వాహణాధికారులను (ఈవోలను) నియమించింది. గండి ఆంజనేయస్వామి ఆలయానికి కర్నూలు ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్ గురు ప్రసాద్, ప్రొద్దుటూరు శ్రీ అగస్త్యేశ్వరస్వామి ఆలయానికి కేవీ రమణ, ప్రొద్దుటూరు శ్రీకృష్ణ గీతాశ్రమానికి శ్రీధర్లను నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ మూడు ఆలయాలకు ఈవోగా ఉన్న వెంకటసుబ్బయ్య శనివారం పదవీ విరమణ చేస్తున్నారు.