పులివెందుల: గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

1206చూసినవారు
పులివెందుల: గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
పులివెందుల మండలం బెస్తవారిపల్లె గ్రామ సమీపంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల బాలుర పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ, పాఠశాలలో ఐదో తరగతి, ఇంటర్ ఇంగ్లిష్ మీడియంలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అలాగే, 6, 7, 8, 9, 10వ తరగతులలో ఖాళీగా ఉన్న సీట్లకు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్