కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలను పూర్తిగా నిరాశపరిచిందని కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు, జల్ జీవన్ మిషన్, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన వంటి కీలక పథకాలకు కేటాయింపులు తగ్గించడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా, ఉపాధి హామీ పథకానికి గతేడాది రూ. 88,000 కోట్లు కేటాయించగా, ఈసారి కేవలం రూ. 30,000 కోట్లే కేటాయించడం దారుణమని ఆయన అన్నారు.