పులివెందులలోని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బుధవారం రాత్రి స్వామివారు సర్వ భూపాల వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నిత్య కైంకర్యాలు, ప్రత్యేక పుష్పాలంకరణతో స్వామివారిని సుందరంగా అలంకరించారు. సర్వ భూపాల వాహనంపై శ్రీనివాసుడు పుర వీధుల్లో ఊరేగారు.