పులివెందుల పట్టణంలోని వేంకటరమణస్వామి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటరమణుడి స్వామి కళ్యాణం బుధవారం వైభవంగా జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు వరదాచార్యులు వేద మంత్రాల మధ్య శాస్త్రోక్తంగా ఈ కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు ఈ వేడుకను తిలకించి తరించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం జరిగింది.