తొండూరులో గుంత పూడ్చాలని వినతి

3220చూసినవారు
తొండూరులో గుంత పూడ్చాలని వినతి
తొండూరు మండలం ఎస్సీ కాలనీలో పైప్‌లైన్ మరమ్మతుల కోసం తీసిన ఐదు అడుగుల లోతు గుంతను పూడ్చకపోవడంతో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు, వృద్ధులకు ప్రమాదం పొంచి ఉందని, వర్షం నీరు చేరితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి గుంతను పూడ్చాలని కాలనీవాసులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్