సచివాలయాల్లో పేపర్ల కొరత

3291చూసినవారు
సచివాలయాల్లో పేపర్ల కొరత
ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ ద్వారా వన్ బీ, అడంగల్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను అందిస్తోంది. అయితే, గత పది రోజులుగా సచివాలయాలు, మీ సేవ కేంద్రాల్లో హై సెక్యూరిటీ పేపర్లు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా, వితంతు, ఇతర పింఛన్లకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి కావడంతో, ప్రజలు ధ్రువపత్రాల కోసం సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అధికారులు వెంటనే హై సెక్యూరిటీ పేపర్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్