లింగాల మండలం పట్నూతలకి చెందిన చిన్నారి నిత్విక హత్య ఘటన తీవ్ర విషాదాన్ని కలిగించిందని పులివెందుల
టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి అన్నారు. శనివారం
టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, ఈ కేసులో నిందితురాలు స్వాతిపై పోలీసులు ఇప్పటికే చట్టపరమైన చర్యలు చేపట్టారని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ ఘటనపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.