భూగర్భ జలాల పెంపు, రైతులకు సాగునీటి సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా నూతన లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను అమలు చేస్తున్నట్లు
టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి తెలిపారు. ఆదివారం లింగాల మండలంలోని అంకేవాని పల్లి గ్రామంలో నూతన లిఫ్ట్ ఇరిగేషన్ను ఆయన ప్రారంభించారు. రైతులు బోర్లు వేసినా నీరు పడక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, వంకల ద్వారా నీటిని మళ్లించి భూగర్భ జలాలను పెంచేలా ఈ పథకం రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు.