మాజీ ఎంపీ డాక్టర్ తులసిరెడ్డి సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్ గా మార్చిందని విమర్శించారు. వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ, సూపర్ సిక్స్ హామీలలో ఏ ఒక్కటి అమలు చేయలేదని, ఆడబిడ్డ నిధి, 50 ఏళ్లకు పెన్షన్ వంటి హామీలు నెరవేర్చలేదని ఆరోపించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లు రాక డబుల్ ఇంజన్ ట్రబుల్ ఇంజన్, డొక్కు ఇంజన్ గా మారిందని అన్నారు.