పులివెందులలో శ్రీవారికి తిరుప్పావడ సేవ

395చూసినవారు
పులివెందులలో శ్రీవారికి తిరుప్పావడ సేవ
పులివెందులలోని శ్రీ పద్మావతి సమేత కళ్యాణస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛారణతో తిరుప్పావడ సేవను నిర్వహించారు. పులిహోర ప్రసాదాలు, పండ్లతో స్వామివారి రూపాన్ని అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు అందుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్