తొండూరు మండల సర్వ సభ్య సమావేశం సోమవారం ఉదయం 11 గంటలకు ఎంపీపీ నారాయణమ్మ అధ్యక్షతన ఎంపీడీవో ఆఫీస్ సభా భవనంలో జరగనుంది. ఈ సమావేశంలో 16 అంశాలపై చర్చించనున్నారు. అయా శాఖల అధికారులు తమ ప్రగతి నివేదికలతో హాజరు కావాలని ఎంపీడీవో విష్ణు ప్రసాద్ రెడ్డి కోరారు. ప్రజా ప్రతినిధులు తప్పక హాజరు కావాలని సూచించారు.