రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

2426చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మండలం కొండప్ప గారి పల్లెలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో రాయచోటి తహశీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ కుందా శేఖర్, చిలేకంపల్లి గ్రామానికి చెందిన మోరం నాగిరెడ్డి అనే వ్యక్తి మృతి చెందారు. వీరు పనుల నిమిత్తం రాయచోటికి వెళుతుండగా గాలివీడు క్రాస్ వద్ద రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్