వేముల మండలం గొల్లలగూడూరుకు చెందిన ఎద్దుల జగన్ మోహన్ రెడ్డి, లక్ష్మీదేవి దంపతుల కుమారుడు ఎద్దుల మురళీధర్ రెడ్డి గ్రూప్-2 ఉద్యోగానికి ఎంపికయ్యారు. తన విజయంలో తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల మార్గనిర్దేశం కీలక పాత్ర పోషించాయని ఆయన తెలిపారు. నిరంతర కష్టంతో పాటు, పట్టుదల ఉంటే ప్రతి లక్ష్యం సాధ్యమేనని ఆయన పేర్కొన్నారు. ఈ విజయం ఎంతోమంది యువతకు స్ఫూర్తినిస్తుంది.