
గనుల బాధితులకు అండగా ఉంటాం: కలెక్టర్ వెంకటేశ్వర్
గనుల అభివృద్ధి కారణంగా ఆస్తులు కోల్పోయి నిరాశ్రయులైన వారిని అన్ని విధాలా ఆదుకుంటామని తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం తిరుపతి జిల్లాలోని ఓబులవారిపల్లి మండలంలో పర్యటించిన ఆయన, ప్రపంచ ఖ్యాతి గాంచిన మంగంపేట ముగ్గురాళ్ల గనిని పరిశీలించారు. ఆర్డివోతో కలిసి బాధితులకు సత్వర న్యాయం చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.







































