‘4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలి’ – ఏఐటీయూసీ నిరసన

210చూసినవారు
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు గంగాధర్ బుధవారం డిమాండ్ చేశారు. ఓబులవారిపల్లె మండలం మంగంపేట ఏపీఎండీసీ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఉన్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగుగా మార్చడం అన్యాయమన్నారు. కొత్త చట్టాలను రద్దు చేయాలని కార్మిక సంఘాలు వ్యతిరేకించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.

సంబంధిత పోస్ట్