రెండు రోజుల పాటు జరిగిన ఏఐటీయూసీ రైల్వేకోడూరు నియోజకవర్గ 13వ మహాసభల్లో సోమవారం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గంగాధర్ అధ్యక్షుడిగా, జయచంద్ర ప్రధాన కార్యదర్శిగా, మురళి కోశాధికారిగా ఎన్నికయ్యారు. ఈ మహాసభల్లో కార్మిక సమస్యలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక విధానాలపై చర్చించి ఎనిమిది తీర్మానాలు ఆమోదించారు. మొత్తం 39 మంది కౌన్సిల్ సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసినట్లు AITUC జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.