శనివారం అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో ఏపీఎండీసీలో పనిచేస్తున్న కార్మికుల పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ఏపీఎంసీ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటీయూసీ) నాయకులు చీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ గోపీనాథ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అవుట్‌సోర్సింగ్ కార్మికుల క్రమబద్ధీకరణ, పెండింగ్ పదోన్నతులు, మరణ బీమా, గ్రాట్యుటీ వంటి సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. కార్మిక సంఘాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు.