అరటి తోటకు నిప్పు.. 6 వేల చెట్లు అగ్నికి ఆహుతి

729చూసినవారు
శుక్రవారం ఓబులవారిపల్లి మండలంలోని పెద్దఓరంపాడు గ్రామంలో ఆకతాయిలు నిప్పుపెట్టడంతో వల్లూరుపల్లికి చెందిన కొత్త పిచ్చమ్మ, రామసుబ్బారెడ్డి దంపతులకు చెందిన 5 ఎకరాల అరటి తోట దగ్ధమైంది. కోతకు సిద్ధంగా ఉన్న 6 వేల అమృతపాణి రకం అరటి చెట్లు, డ్రిప్ పైపులు, ఇతర పరికరాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో సుమారు రూ. 6 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. ఉద్దేశపూర్వకంగా పంటను తగులబెట్టారని బాధితులు ఆరోపించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్