రైల్వే కోడూరు నియోజకవర్గంలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించే లక్ష్యంతో, 48 లక్షల రూపాయల వ్యయంతో నూతన సిమెంట్ రోడ్డు, గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ జరిగింది. పుల్లంపేట మండలం వత్తలూరు పంచాయతీ పరిధిలోని లేబాకువారిపల్లి గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ & కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మౌలిక వసతులు అవసరమని, ప్రతి గ్రామానికి అభివృద్ధి బాట వేయాలనే సంకల్పంతో ఈ పనులు చేపట్టినట్లు రూపానంద రెడ్డి తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణంతో గ్రామ ప్రజలకు రాకపోకలు సులభమవుతాయని, వర్షాకాలంలో ఇబ్బందులు తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి NDA కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు హాజరయ్యారు.