చిట్వేలి: విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు

4017చూసినవారు
రైల్వే కోడూరు సమీపంలో చిట్వేలి మండలం నక్కలపల్లి పంచాయతీ పరిధిలో మంగళవారం రాత్రి కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అయితే, ఈ ఘటనతో కొద్దిసేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ శాఖ సిబ్బంది వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టి, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్