అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరు పరిధిలోని చిట్వేల్ మండలం మల్లెంపల్లి గ్రామ శివారులో ఆదివారం చట్టవిరుద్ధంగా కోడిపందేలు నిర్వహిస్తున్న 8 మందిని చిట్వేల్ పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ, రేణిగుంట డీఎస్పీ ఆదేశాల మేరకు ఈ దాడి జరిగింది. నిందితుల వద్ద నుంచి రూ. 26,400 నగదు, 7 కోడిపుంజులను స్వాధీనం చేసుకున్నారు. ఏపీ గేమింగ్ చట్టం సెక్షన్ 9(II) కింద కేసు నమోదు చేశారు. కోడిపందేలు, జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, అలాంటి ఘటనలు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.