ఓబులవారిపల్లె మండలంలోని హైలరాచపల్లి, యల్లాయపల్లి, మంగంపేట, ఎద్దులవారిపల్లి, చిన్నంపల్లి గ్రామాల్లో ఐదుగురు లబ్ధిదారులకు రూ. 34, 341 నుంచి రూ. 1, 49, 405 వరకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్, ముక్కా వరలక్ష్మి లబ్ధిదారుల ఇళ్ల వద్ద చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో ఎన్డీఏ నేతలు పాల్గొన్నారు.