రైల్వేకోడూరు జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వివాదం ఊహించని మలుపు తిరిగింది. అతడిపై తీవ్ర ఆరోపణలు చేసిన మహిళా ఉద్యోగిని హర్ష వీణ అదృశ్యమైంది. ఆమె కనిపించడం లేదని, ఫోన్ స్విచ్, ఆఫ్ అయ్యిందని పోలీసులు చెప్పారు. పోలీసులకి ఇంకా అందుబాటులోకి రాలేదని, స్థానికంగా లేనట్లు తెలుస్తోందన్నారు. నేరుగా విచారణకు హాజరైనా లేకపోతే తమను రమ్మని పిలిచినా వెళ్లి విచారిస్తామని అన్నారు. త్వరలోనే దర్యాప్తు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఇక ఆమెపై రెండు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు అయ్యాయి.