అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పట్టణంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా, జనవరి 30, 2026న, గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ పార్టీ ఇంచార్జ్, KUDA చైర్మన్ శ్రీ ముక్కా రూపానంద రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, సత్యం, త్యాగం, అహింస మార్గాలు నేటి తరానికి మార్గదర్శకమని, గాంధీజీ ఆశయాలను స్మరించుకుంటూ ప్రజాసేవే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కార్యదర్శి తాతం శెట్టి నాగేంద్ర, పోకల సుబ్రహ్మణ్యం (మణి), NDA కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.