ఓబులవారిపల్లి మండలం వై. కోట గ్రంథాలయంలో గురజాడ అప్పారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రంథాలయ అధికారి ఎం. సుధాకర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో
విద్యార్థులు గురజాడ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయురాలు తులసి మాట్లాడుతూ సామాజిక రుగ్మతల నిర్మూలనకు గురజాడ రచనలు ప్రజల్లో చైతన్యం కలిగించాయని తెలిపారు. ఆయన సాహిత్య సేవలను స్మరించుకుంటూ జయంతి వేడుకలను నిర్వహించడం స్ఫూర్తిదాయకమన్నారు.