అరవ శ్రీధర్‌పై మరోసారి తీవ్ర ఆరోపణలు చేసిన వీణా

950చూసినవారు
ఏపీ జనసేన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై బాధిత మహిళ వీణా బుధవారం మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. తాను ఎమ్మెల్యే శ్రీధర్‌ను ట్రాప్ చేయలేదని, ఆయన ఒక డమ్మీ క్యాండిడేట్ అని మండిపడ్డారు. అలాగే ఎమ్మెల్యే శ్రీధర్ కు ఆరుగురు మహిళలతో సంబంధాలు ఉన్నట్లు తాను నిరూపించగలనని, తనపై చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపించాలని ఆమె సవాల్ విసిరారు. రూ. 25 కోట్లు అడిగిన వాయిస్ తనది కాదని స్పష్టం చేసిన బాధితురాలు, శ్రీధర్‌కు తెలిసే తాను స్క్రీన్ రికార్డు చేశానని తెలిపారు.

సంబంధిత పోస్ట్