రైల్వే కోడూరు పట్టణంలో శుక్రవారం మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్, కుడా చైర్మన్ శ్రీ ముక్కా రూపానంద రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, మహాత్మా గాంధీ చూపిన సత్యం, త్యాగం, అహింస మార్గాలు నేటి తరానికి మార్గదర్శకమని, గాంధీజీ ఆశయాలను స్మరించుకుంటూ ప్రజాసేవ చేయాలని పిలుపునిచ్చారు.