బుధవారం కోడూరు మండలం ఓబనపల్లి గ్రామానికి చెందిన వీఆర్ఏ కనపర్తి మణిపై గుర్తుతెలియని వ్యక్తులు కళ్లల్లో కారం చల్లి కత్తులతో దాడి చేశారు. విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో చిట్వేలి బ్రిడ్జి సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో వీఆర్ఏ మణికి తీవ్ర గాయాలవడంతో, స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి, దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.