మంగంపేటలో కత్తితో వ్యక్తి హల్‌చల్

283చూసినవారు
మంగంపేటలో కత్తితో వ్యక్తి హల్‌చల్
మంగళవారం, ఓబులవారిపల్లి మండలం మంగంపేటలో ముగ్గురాయి రవాణా విషయంలో వివాదం తలెత్తింది. రైల్వేకోడూరు మండలం అనంతరాజుపేటకు చెందిన రాజనాల చంద్రశేఖర్ అనే వ్యక్తి, తన లారీకి అనుమతి ఇవ్వాలని ప్రైవేట్ మిల్లు మేనేజర్ సుంకర ఉమామహేశ్వరరావును కోరారు. మేనేజర్ నిరాకరించడంతో ఆగ్రహించిన చంద్రశేఖర్, కత్తితో బెదిరించి, మిల్లులోకి వచ్చిన ఇతర లారీలను అడ్డగించి గందరగోళం సృష్టించినట్లు సమాచారం. దీంతో భయాందోళనకు గురైన మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్