శనివారం, అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేల్ మండలం మాలే మార్పురం పంచాయతీ పరిధిలోని ఈడిగపల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ గంగమ్మ తల్లి జాతర మహోత్సవంలో నియోజకవర్గ శాసనసభ్యులు అరవ శ్రీధర్ పాల్గొన్నారు. గ్రామస్తుల ఆహ్వానం మేరకు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గ్రామ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.