వీడియో రికార్డ్ చేసిన ప్రతీది MLA కు తెలుసు: బాధితురాలు

730చూసినవారు
వీడియో రికార్డ్ చేసిన ప్రతీది MLA కు తెలుసు: బాధితురాలు
కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్‌పై ఆరోపణలు చేస్తున్న బాధితురాలు బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. తాను వీడియో రికార్డు చేస్తున్న విషయం ఎమ్మెల్యేకు కూడా తెలుసని వీణా తెలిపారు. ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్లిన ప్రతీసారి తనకు ఫోన్ చేసేవారని, ఒకవేళ తాను కాల్ కట్ చేసినా రాత్రి సమయాల్లో తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసేవారని ఆమె ఆరోపించారు. అలాగే తనకు UPSCలో ఉద్యోగం వచ్చినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారానికి తనకు ఎలాంటి సంబంధం లేదని బాధితురాలు స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్