రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ను వెంటనే అరెస్టు చేయాలని మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు గురువారం డిమాండ్ చేశారు. వైసీపీ నాయకులతో కలిసి పట్టణంలోని టోల్‌గేట్ సమీప గాంధీ విగ్రహం వద్ద ఆయన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మహిళను పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన ఎమ్మెల్యేపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.