ఎన్టీఆర్ పెన్షన్ పంపిణీ: ముక్కా రూపానంద రెడ్డి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు అందజేత

336చూసినవారు
ఎన్టీఆర్ పెన్షన్ పంపిణీ: ముక్కా రూపానంద రెడ్డి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు అందజేత
ఓబులవారిపల్లి మండలం ముక్కవారిపల్లి పంచాయతీ పరిధిలో ఎన్టీఆర్ పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఒక రోజు ముందుగానే విజయవంతంగా నిర్వహించారు. రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు KUDA చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఒక లబ్ధిదారుడికి మూడు నెలల పెన్షన్ను ఒకేసారి మంజూరు చేసి అందించారు. ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్లు అర్హులైన ప్రతి ఒక్కరికీ సమయానికి చేరేలా కృషి చేస్తున్నామని, ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముక్కా రూపానంద రెడ్డి తెలిపారు. పేదలు, వృద్ధులు, దివ్యాంగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ముందస్తుగానే పెన్షన్లు అందించామని, అవసరమైతే ప్రత్యేకంగా సహాయం అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో NDA కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్