అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసోత్సవం

1465చూసినవారు
అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసోత్సవం
ఓబులవారిపల్లి-2 అంగన్వాడీ కేంద్రంలో 9వ రాష్ట్రీయ పోషణ మాసోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం ప్రాధాన్యంపై అవగాహన కల్పించారు. ఆకు కూరలు, పండ్లు, పాలు, గుడ్లు వంటి పోషకాహారాన్ని తీసుకోవాలని ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్ గుణవతి సూచించారు. చిన్నారులకు సకాలంలో టీకాలు వేయించాలని తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది, గర్భిణీలు, బాలింతలు, పిల్లల తల్లులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్