రైల్వేకోడూరు: నిద్రలోనే మృత్యు ఒడికి యువకుడు

1107చూసినవారు
రైల్వేకోడూరు: నిద్రలోనే మృత్యు ఒడికి యువకుడు
రైల్వేకోడూరు పట్టణంలోని మామిడికాయల యార్డ్ సమీపంలో శనివారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన రవీంద్ర (20) అనే యువకుడు మృతి చెందాడు. నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని లారీ అతనిపైకి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. రైల్వేకోడూరు ఎస్ఐ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. లారీని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

సంబంధిత పోస్ట్