రైల్వే కోడూరు: రోడ్డు నిర్మాణానికి శనివారం భూమి పూజ

292చూసినవారు
రైల్వే కోడూరు: రోడ్డు నిర్మాణానికి శనివారం భూమి పూజ
రైల్వే కోడూరు మండలం కమిశెట్టి నగర్లో 20 లక్షల రూపాయల వ్యయంతో రోడ్డు నిర్మాణానికి శనివారం భూమి పూజ జరిగింది. టీడీపీ పార్టీ ఇంచార్జ్ & KUDA చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, గ్రామాభివృద్ధిలో భాగంగా మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడమే NDA కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి నాయకులు, టీడీపీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్