అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం చెన్నరాజుపోడు గ్రామంలో బరుర్దార్ చాంద్ బాష, నూర్-ఇ-చపి ల నిఖా వేడుక వారి స్వగృహంలో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్, కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకలో కూటమి నేతలు, గ్రామస్తులు పాల్గొన్నారు.