మాజీ వైసిపి మంత్రి అంబటి రాంబాబు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ, మండలంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. పార్టీ అధ్యక్షుడు కాకర్ల నాగార్జున నాయుడు ఆధ్వర్యంలో అంబటి రాంబాబు దిష్టిబొమ్మను చెప్పులతో మాలవేసి దహనం చేశారు. అంబటిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రామానుజుల నాయుడు, కాకర్ల సుబ్బరాయుడు, అనంతయ్య యాదవ్, బాలకృష్ణ యాదవ్, పగడాల వెంకటేశ్వర్లు, బండారు శివప్రసాద్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.