రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేల్ మండలంలో తెలుగుదేశం పార్టీ 44వ వ్యవస్థాపక దినోత్సవాన్ని నాగవరం, నేతివారిపల్లి, పెద్దూర్, జెట్టివారిపల్లి, చిట్వేల్ గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండాలను ఎగురవేసి, నందమూరి తారక రామారావుకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, దశాబ్దాలుగా పార్టీకి అండగా నిలిచిన కార్యకర్తలను అభినందించారు. పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అన్నమయ్య, రైల్వే కోడూరు ప్రాంతాల్లో ఈ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.