చిట్వేల్‌లో టీడీపీ 44వ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా నిర్వహణ

716చూసినవారు
చిట్వేల్‌లో టీడీపీ 44వ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా నిర్వహణ
తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేల్ మండలంలో తెలుగుదేశం పార్టీ 44వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. నాగవరం, నేతివారిపల్లి, పెద్దూర్, జెట్టివారిపల్లి, చిట్వేల్ గ్రామాల్లో పార్టీ జెండాలు ఎగురవేసి, నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పించారు. పార్టీకి కార్యకర్తలే బలం అని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్