ఓటరు జాబితా సవరణపై అధికారులకు తహసీల్దార్ సూచనలు

626చూసినవారు
ఓటరు జాబితా సవరణపై అధికారులకు తహసీల్దార్ సూచనలు
అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేల్ మండలంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై శనివారం అవగాహన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తహసీల్దార్ ఎస్.వి. నరసింహారావు మాట్లాడుతూ, అర్హులైన ప్రతి పౌరుడిని ఓటరుగా నమోదు చేయాలని, మరణించిన వారి పేర్లను తొలగించాలని, అవసరమైన మార్పులు చేయాలని సూచించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులను తప్పనిసరిగా పాటించాలని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో బూత్ స్థాయి అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్