చిట్వేల్‌లో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ వేడుకలకు శనివారం ఏర్పాట్లు పూర్తయ్యాయి. మండల అధ్యక్షుడు నాగార్జున నాయుడు ఆధ్వర్యంలో మార్చి 29న నాగవరం నుంచి ఎన్టీఆర్ నగర్ వరకు పసుపు పండుగగా ఈ వేడుకలు నిర్వహించనున్నారు. ఉదయం వివిధ గ్రామాల్లో జెండా ఆవిష్కరణలు, అనంతరం భారీ సభ జరగనుంది. పార్టీ స్థాపకుడు నందమూరి తారకరామారావుకు నివాళులు అర్పించనున్నారు. కార్యకర్తలంతా ఏకతాటిపైకి వచ్చి వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.