సేవా కార్యక్రమంతో కీర్తిశేషులు పగడాల సుబ్రహ్మణ్యానికి నివాళి

2చూసినవారు
సేవా కార్యక్రమంతో కీర్తిశేషులు పగడాల సుబ్రహ్మణ్యానికి నివాళి
చిట్వేల్ మండల పరిధిలోని చిట్వేల్ - రాపూరు రోడ్డు తిమ్మాయపాలెం క్రాస్‌ వద్ద ఆదివారం శ్రీశ్రీశ్రీ దస్తగిరి నారాయణ తపోవన భయాంజనేయ స్వామి ఆశ్రమంలో పెద్దల భోజన సౌకర్యం కోసం రూ. 5 వేల విలువైన బియ్యం, పప్పు దినుసులు, కూరగాయలు అందజేశారు. కీర్తిశేషులు పగడాల సుబ్రహ్మణ్యం జ్ఞాపకార్థం ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. ఆశ్రమ పీఠాధిపతి నాగేశ్వరమ్మ దాతలకు ఆశీస్సులు తెలిపారు.

సంబంధిత పోస్ట్