పుల్లంపేట మండలం రెడ్డిపల్లి పేట సమీపంలోని హైవేపై ఆదివారం రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. కడప నుంచి శ్రీకాళహస్తి వైపు వెళ్తున్న కారు, తిరుమల నుంచి కడప వైపు వస్తున్న కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళకు చేయి విరగగా, మరికొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.