కోడూరులో గుర్తుతెలియని వ్యక్తి మృతి

199చూసినవారు
కోడూరులో గుర్తుతెలియని వ్యక్తి మృతి
ఆదివారం కోడూరు పట్టణంలో పాత బస్టాండ్‌కు వెళ్లే మార్గంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడి వివరాలను ఆరా తీశారు. అనంతరం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు కోడూరు పోలీసులను సంప్రదించాలని అధికారులు కోరుతున్నారు.